Featured2 Sports

ధనాధన్..మస్తు మజా…

ఐపీఎల్ మ్యాచ్ లు రాను రాను ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. సిక్స్ లు, ఫోర్లతో బ్యాట్స్ మెన్ అదరగొడుతున్నారు. భారీ టార్గెట్ ను ప్రత్యర్థి టీమ్ ముందు ఉంచుతున్నాయి. ఛేజింగ్ కు దిగిన ప్రత్యర్థి జట్టు సైతం అదే మెరుపు వేగంతో టార్గెట్ ను ఛేదిస్తున్నాయి.

బౌండరీ లేకుండానే భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు కొందరు ఆటగాళ్లు. సూపర్‌ హిట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాట్స్‌మన్‌ అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ ముగ్గురే నితీశ్‌ రాణా, డేవిడ్‌ మిల్లర్‌, డ్వేన్‌ బ్రావో.

199 పరుగులతో గట్టి సవాల్‌ విసిరాననుకున్న పంజాబ్‌కు షాక్‌ తగిలింది! ముంబయి బ్యాట్స్‌మెన్‌ పోటాపోటీగా వీరబాదుడుకు దిగిన వేళ.. పంజాబ్‌ బౌలర్లకు కనీస మర్యాద కూడా దక్కలేదు. పిడుగుల్లాంటి షాట్లతో.. సిక్స్‌లు, ఫోర్ల మోతతో ఇండోర్‌లో స్టేడియం హోరెత్తిపోయింది. బట్లర్‌, నితీష్‌ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబయి ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అంతటి లక్ష్యాన్ని సైతం మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లా మెరుపు సెంచరీ వృథా అయింది.