Featured Sports

ధావన్,షమి ఇన్ గంభీర్ ఔట్..చాంపియ‌న్స్ ట్రోఫీటీమ్ ఇదే

 

 

 

 

 

 

 

 

 

వ‌చ్చే నెల 1 నుంచి ప్రారంభ‌మ‌య్యే చాంపియ‌న్స్ ట్రోఫీకి టీమిండియాను ఎంపిక చేసింది సెల‌క్ష‌న్ క‌మిటీ. ఐపీఎల్‌లో రాణించిన ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశం క‌ల్పించారు. పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి కూడా తిరిగొచ్చాడు. చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొన‌డానికి ఆదివార‌మే బీసీసీఐ క్లియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఐసీసీతో నెల‌కొన్న ఆదాయ పంపిణీ వివాదంతో మొదట టోర్నీకి దూరంగా ఉండాల‌ని భావించినా.. ఆదివారం జ‌రిగిన ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనాల‌ని నిర్ణయించింది బీసీసీఐ. ఈ టోర్నీకి భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతుంది. 2013లో చివ‌రిసారి జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై గెలిచి ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఇక వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌, సురేశ్ రైనా, కుల్దీప్ యాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, శార్దూల్ ఠాకూర్‌ల‌ను స్టాండ్‌బైలో ఉంచిన‌ట్లు సెల‌క్ట‌ర్లు చెప్పారు.

చాంపియ‌న్స్ ట్రోఫీకి టీమిండియా
విరాట్ కోహ్లి, శిఖ‌ర్ ధావ‌న్‌, రోహిత్ శ‌ర్మ‌, అజింక్య ర‌హానే, ఎమ్మెస్ ధోనీ, యువ‌రాజ్ సింగ్‌, కేదార్ జాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌, జ‌డేజా, ష‌మి, ఉమేష్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మ‌నీష్ పాండే. జస్‌ప్రీత్ బుమ్రా