Sports

ధోనీకి రియో గోల్డ్ మెడలిస్ట్ సెల్యూట్

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి , జార్ఖండ్‌ డైనమైట్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి రియో ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత క్యాస్టర్‌ సెమెన్యా సెల్యూట్‌ చేశారు. ధోనీ జీవిత కథ ఆధారంగా 2016లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నీరజ్‌పాండే తెరకెక్కించిన సినిమా ‘ఎమ్‌ఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ’.
ఈ సినిమాను తాజాగా దక్షిణాఫ్రికా అథ్లెటిక్‌ క్రీడాకారిణి క్యాస్టర్‌ సెమెన్యా చూశారు. వెంటనే ఆమె సోషల్‌మీడియా ద్వారా ధోనీతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘ధోనీ ఇప్పుడే మీ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా చూశాను. మీ కథ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఎమ్‌ఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ… సెల్యూట్‌’ అని పేర్కొన్నారు. క్యాస్టర్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు.