Featured2 Sports

ధోనీ హీరో.. స్టీవ్ స్మిత్ విల‌న్‌!

 

 

 

 

 

 

 

 

 

ఐపీఎల్ ప‌దో సీజ‌న్‌లో ధోనీని కెప్టెన్సీ నుంచి త‌ప్పించి స్టీవ్ స్మిత్‌కు ఇచ్చిన త‌ర్వాత ప్ర‌తి ధోనీ అభిమాని ధోనీ హీరో..స్టీవ్ స్మిత్ విలన్ లా భావించారు. కానీ ఈసారి పుణె టీమ్ మెంబ‌రే ఈ మాట అంటున్నాడు. అత‌ని దృష్టిలో ధోనీ హీరో.. స్మిత్ విల‌న్ అట‌. ఆ మాట అన్న‌ది ఎవ‌రో కాదు పుణె టీమ్ మిలియ‌న్ డాల‌ర్ మ్యాన్ బెన్ స్టోక్స్‌. అయితే ఇది అత‌డు సీరియ‌స్‌గా అన్న విష‌యం కాదు. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో విజ‌యాల త‌ర్వాత మంచి మూడ్‌లో ఉన్న ఆ టీమ్ ప్లేయ‌ర్స్‌.. కొన్ని లాక‌ర్ రూమ్స్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ధోనీ, ర‌హానే, స్టోక్స్ ఈ ఫ‌న్నీ గేమ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని చిలిపి ప్ర‌శ్న‌లకు క్రికెట‌ర్లు కూడా అంతే చిలిపిగా బ‌దులిచ్చారు. చివ‌ర్లో బాలీవుడ్‌లో చాన్స్ వ‌స్తే ఎవ‌రు హీరో, ఎవ‌రు విలన్‌గా ఉండాల‌న్న ప్ర‌శ్న‌కు స్టోక్స్‌.. హీరోగా ధోనీని, విల‌న్‌గా స్మిత్‌ను సెల‌క్ట్ చేశాడు.