Latest News Politics

నగరంలో వేలాడే వంతెనకు శంకుస్థాపన

 

హైదరాబాద్ పర్యాటక సిగలో మరో నిర్మాణం చేరబోతోంది. దుర్గం చెరువుపై 1.04 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న వేలాడే వంతెన నిర్మాణానికి తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. దీనితో పాటు రూ.3.5కోట్లతో చేపట్టే చెరువు సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకే రూ.184 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. నగర పర్యాటకానికి దుర్గం చెరువును ప్రత్యేక ఆకర్షణంగా తీర్చిదిద్దుతామన్నారు. వంతెన నిర్మాణాన్ని 12-14 నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో వ్యూహాత్మకంగా వెళ్తొందన్నారు.
* ఈ వంతెన అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్‌ నుంచి మూడు నిమిషాల వ్యవధిలో హైటెక్‌సిటీకి చేరుకోవచ్చు.
* 1.048 మీటర్ల పొడవున నిర్మాణమయ్యే ఈ వంతెన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.92కోట్లు, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) రూ.92కోట్లు భరిస్తాయి. ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది.