Latest News

నీటిబుడగ..సింహాన్ని భయపెట్టిందోచ్..!


సింహం అడవికే రారాజు. దానికి కోపమొచ్చిందంటే ఎంతటి జంతువైనా, మనుషులైనా భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిందే. అందరికీ వణుకు పుట్టించే సింహామే భయపడింది. వినడానికి వింతగా ఉన్నా...ఇది నిజం. అది ఓ మామూలు నీటి బుడగకి.
బ్రిటన్‌లోని ప్యారడైజ్ జంతుసంరక్షణ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఊదిన నీటి బుడగ మోటో (సింహం పేరు)వైపు వచ్చింది. సింహం నీటి బుడగను ఫాలో అవుతుండగా అది టపీమనీ పగిలిపోయింది. నీటిబుడగ పగిలిన వెంటనే ఉలిక్కిపడిన సింహం వెంటనే పక్కకి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్‌ అవుతోంది.