Featured Movies

నెట్ లో ‘బాహుబలి 2’ సినిమా లీక్..పార్ట్ 1

వెండితెర దృశ్యకావ్యం ‘బాహుబలి 2’హై ఎక్స్ ఫెక్టేషన్స్ మధ్య వాల్డ్ వైడ్ గా ఇవాళ రిలీజ్ అయింది. మార్నింగ్ షో అయిందో లేదో …బాహుబలి 2 లీక్డ్ వీడియా నెట్ లో పెట్టేశారు పైరసీగాళ్లు. 51 నిమిషాల నిడివి గల వీడియోను అప్ లోడ్ చేశారు. movierulz.ch సైట్ లో ఈ వీడియోను పెట్టేశారు.దాదాపు 4 వందల కోట్లు ఖర్చు పెట్టి..రెండేళ్లు కష్టపడి తీసిన సినిమా గంటల్లో ఆన్ లైన్ ప్రత్యక్షమైందంటే..ఫైరసీ ఏ లెవల్లో జరుగుతుందో అర్థంమవుతుంది. బాహుబాలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు రెండేళ్లుగా దేశమే కాదు ..ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ మూవీ చూసేందుకు వారం రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆన్ లైన్లో గంటల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడుపోయాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. సాహోరే రాజమౌళి అంటూ తెలుగోడి కీర్తిని చాటేందుకు దేశం సిద్ధమైంది. ఈ తరుణంలో బాహుబలి2 సినిమా నెట్ లో ప్రత్యక్షమవ్వడం అభిమానుల్ని విస్మయ పరిచింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా..పైరసీగాళ్ల చేతిలో పడటం సినీపరిశ్రమను ఆందోళన పరుస్తోంది.
ఇక కథ విషయానికొస్తే…
అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి ఓ అమాయకుడిలా నటిస్తాడు. కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిపడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్‌) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే..‘బాహుబలి 1’ను విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాడు రాజమౌళి. దానికి పదిరెట్లు ‘బాహుబలి 2’పై శ్రద్ధపెట్టాడు. ప్రతి ఫ్రేములోనూ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాయాజాలం కనిపిస్తుంది. దీంతోపాటు భావోద్వేగాల పరంగా పాత్రలను అంతేస్థాయిలో తీర్చిదిద్దాడు. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత్ర బలంగా కనిపిస్తూ ఉంటుంది. తొలి భాగంలో కట్టప్ప చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. ఈ భాగంలో కట్టప్ప చేత కూడా నవ్వులు పూయించాడు దర్శకుడు. కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం ప్రథమార్ధానికే హైలైట్‌గా నిలుస్తుంది. విశ్రాంతికి ముందు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. భావోద్వేగ సన్నివేశాలను ఎంత బలంగా తెరపై చూపించడంలో తనకున్న పట్టును మరోసారి ప్రదర్శించాడు. పాటలు కథలో భాగంగా కలిసి సాగాయి. సుబ్బరాజుతో చేయించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీంతో తొలి సగంలోనే అన్నిరకాల భావోద్వేగాలను చూపించినట్లయ్యింది.
ఇక ద్వితీయార్ధంలో కథపైనే సినిమాను నడిపించాడు రాజమౌళి. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం ప్రేక్షకుడికి తెలుస్తున్నా, దాన్ని ఎంత అందంగా, ఆకట్టుకునేలా ఉంటుందోనన్న ఆసక్తిని రేకెత్తించాడు. ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలకుండా చేశాడు. ‘బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు’ అనే కీలక ఘట్టాన్ని చాలా బాగా చూపించాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో లభించదు. పలు సన్నివేశాల సమాహారంగా కనిపిస్తూ.. ప్రేక్షకుడికి సంతృప్తినిస్తుంది. పతాక సన్నివేశాల్లో రాజమౌళి తన యుద్ధ నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. సుదీర్ఘంగా సాగే ఈ సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. భల్లాల చెప్పుడు మాటలతో.. రాజమాత ఆదేశాలతో.. కటప్ప బాహుబలిని చంపుతాడు..డీటైల్డ్ గా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి ‘బాహుబలి 2’ పై సామాన్య ప్రేక్షకుడు ఎన్ని అంచనాలు పెంచుకున్నాడో వాటన్నింటినీ నిజం చేస్తూ తెరకెక్కించాడు జక్కన్న. రెండేళ్లు కష్టపడి తీసిన బాహుబలి 2 సినిమాను బిగ్ స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..ఇంకెందుకు మీరూ థియేటర్ లో చూసేయండి..పైరసీకి పాతరేయండి..సాహొరే జక్కన్న….