Movies

నెట్ లో వైరల్ గా బేఫిక్రే పాట

 

 

 

 

 

 

 

 

ఆదిత్యాచోప్రా డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్, వాణికపూర్ కాంబినేషన్‌లో వచ్చిన బేఫిక్రే మూవీ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది. ‘నశే సి ఛడ్ గయి’ అంటూ సాగే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ పాటగా నిలిచింది. ఇప్పటికే ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించినట్లు రికార్డుండగా, తాజాగా 6 నెలల్లో యూట్యూబ్‌లో 234 మిలియన్ల (23.4 కోట్లు) అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ సాంగ్‌గా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రణ్‌వీర్‌సింగ్, వాణీకపూర్ మధ్య వచ్చే ఈ పాటను పారిస్‌లో షూట్ చేశారు. యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ ఫేవరేట్ హిందీ సాంగ్‌గా నిలవడం పట్ల యశ్‌రాజ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ గుర్నానీ హర్షం వ్యక్తం చేశారు.