Featured2 Latest News

పరీక్ష రాసిన తర్వాతే పెళ్లి..!

అటు పరీక్ష…అటు పెళ్లి…రెండూ ఒకే టైమ్ కి …ఏం చేయాలో అర్థం కాని ఓ గిరిజన యువతి చదువుకే జై కొట్టింది. ముందు పరీక్ష రాసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పెద్దలకు నచ్చచెప్పింది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌లోని గిరిజన కుటుంబానికి చెందిన దైపాలె బాలాజీ వ్యవసాయ కూలీ. ఆయన కుమార్తె శివనందిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని డీఎడ్ కళాశాలలో టీటీసీ చదువుతోంది. సోమవారం వార్షిక పరీక్ష రాయాల్సి ఉండగా.. కులపెద్దలు 17వతేదీ శివనందినితోపాటు..మరో తొమ్మిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించారు. చదువుకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్న శివనందిని పరీక్ష రాసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులు, కుల పెద్దలకు నచ్చజెప్పింది. వారిని ఒప్పించింది. . ఇచ్చోడ నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించి మరి పరీక్షకు హాజరైంది. తిరిగొచ్చి సంతోషంగా ముడుమూళ్లు వేయించుకుంది.