Featured Politics

పాక్ బంకర్లు బద్దలవుతున్నాయ్..

 

 

 

 

 

 

 

 

పాక్ సైనిక మూకలు ఉగ్రవాదులతో కలిసి ఇద్దరు భారత జవాన్లను పాశవికంగా హత్యచేసిన ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఏ భాషలో చెబితే అర్ధమవుతుందో… అలాంటి భాషలో పాకిస్తాన్‌కు భారత్ బుద్ధి చెబుతున్నట్టు ప్రముఖ మాజీ మేయర్ గౌరవ్ ఆర్య ట్విటర్లో వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని కృష్ణఘాటి సెక్టార్‌ నుంచి ఓ సిక్కు రెజిమెంట్ యూనిట్ పాకిస్తాన్‌‌ బంకర్లపై విరుచుకు పడినట్టు పేర్కొన్నారు. దీని తాలూకు వీడియో కూడా ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న పాకిస్తాన్ బంకర్లు పూర్తి ధ్వంసమైనట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకదాని వెంట ఒకటి వరుసగా పాక్ బంకర్లను బద్దలు కొట్టడంతో… ఘటనాప్రాంతమంతా పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.