Latest News Social

పులి పిల్లకు బాహుబలి పేరు..!

మూవీ వండర్ బాహుబలి మానియా దునియా ఊపేస్తోంది. ఒడిశాలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ అధికారులకు ఈ మానియా పాకింది.
బుధవారం మేఘ, విజయ అనే పులులకు నాలుగు పిల్లలు జన్మించాయి. వీటిలో ఒక దానికి ఏం పేరు పెట్టాలో నిర్ణయించేందుకు భారీ కసరత్తు చేశారు. జూను సందర్శించేందుకు వచ్చినవారి అభిప్రాయాలను సేకరించారు. అత్యధికులు బాహుబలి అని నామకరణం చేయాలని కోరారు. దీంతో అధికారులు ఆ పులి పిల్లకు బాహుబలి అని పేరు పెట్టారు. మేఘ, విజయతో పాటు తెల్ల పులి స్నేహ కూడా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తం ఏడింటిలో ఒకదానికి బాహుబలి అని పేరు పెట్టగా మిగతావాటికి కుందన్, అద్యాష, సాహిల్, విక్కీ, శీను, మౌసమి అని నామకరణం చేశారు.