crime Featured

పోలీస్ ని ఈడ్చుకెళ్లాడు..!


చండీఘడ్ లో స్మగ్లర్లు రెచ్చిపోయారు. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్‌ చేస్తున్నాడని తెలిసి పట్టుకోవడానికి యత్నించిన పోలీసుని కారు బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు ఓ స్మగ్లర్‌. ఆదివారం లుధియానాలో ఈ ఘటన జరిగింది.
నిందితుడు సన్నీ దోడా హెరాయిన్‌ సరఫరా చేయడానికి సిమ్లాపురి ప్రాంతానికి వచ్చాడు. ముందుగా సమాచారం అందుకున్న ఏఎస్సై సంజీవ్‌కుమార్‌ తన బృందంతో కలిసి సిమ్లాపురి దగ్గర నిఘా పెట్టారు.స్మగ్లర్‌ సన్నీ సరిగ్గా పోలీసుల ఎదుటే కారు ఆపడంతో ఏఎస్సై సంజీవ్‌ వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో సన్నీ కారు వేగంగా పోనివ్వడంతో ఏఎస్సై కారు బానెట్‌పై దూకారు. అది చూసి కూడా నిందితుడు కారు ఆపకుండా పోలీస్ ని 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. దాంతో ఏఎస్సై చేతికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అవడంతో వైరల్‌ అయింది. నిందితుడి కోసం పోలీసు బృందం తనిఖీలు నిర్వహించినా లాభం లేకుండాపోయింది. నిందితుడిని పట్టుకోవడానికి ఏఎస్సై సంజీవ్‌ చేసిన సాహసం అభినందనీయమని ,పోలీసునే కారుపై ఈడ్చుకెళ్లిన అతన్ని వదిలిపెట్టమని పంజాబ్‌ యాంటీ నార్కోటిక్‌ వింగ్‌ పోలీసులు తెలిపారు.