Movies

ప్రభాస్ తో అనుష్క..ముచ్చటగా మూడోసారి…


తొలుత మిర్చి మూవీ. ఆ తర్వాత విజువల్ వండర్స్ బాహుబలి మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్విటీ అనుష్క యాక్ట్ చేసి అలరించింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరు జోడి కట్టబోతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలలో రూపొందిన సైజ్‌ జీరో, రుద్రమదేవి చిత్రాలు అభిమానులని అలరించగా తాజాగా భాగమతి పేరుతో ఓ చారిత్రాత్మక చిత్రం చేస్తుంది స్వీటి. ఈ చిత్రాన్ని పిల్ల జమీందార్‌ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బేనర్ పై ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

భాగమతి చిత్రంలో ప్రభాస్ ఓ కామియో పాత్ర పోషించనున్నాడనే వార్త టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. పాత్ర పరిధి తక్కువే అయినప్పటికి, మంచి పవర్ ఫుల్ పాత్ర అని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్నప్పటికి, భాగమతి సినిమాలో కామియో రోల్ పోషించడానికి ఓకే అని చెప్పాడట. అందుకు కారణం అనుష్కతో ఉన్న ఫ్రెండ్షిప్ ఒకటైతే, యూవీ క్రియేషన్ బేనర్ ప్రభాస్ సొంత బేనర్ లాంటిది కావడం. భాగమతి సినిమా కోసం ప్రభాస్ ఇప్పటికే డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసుకున్నాడని చెబుతున్నారు.