Movies

ఫర్హాన్‌ అక్తర్‌తో శ్రద్ధాకపూర్‌ రిలేషన్‌ నిజమేనా..?

 

 

 

 

 

 

 

 

 

ఫర్హాన్‌ అక్తర్‌తో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ రిలేషన్‌లో ఉన్నట్లు చాలాకాలంగా బీటౌన్‌ కోడై కూస్తోంది. శ్రద్ధ కోసమేఫర్హాన్‌ తన భార్య అధునా నుంచి విడిపోయినట్లు టాక్.
ఫర్హాన్‌ అక్తర్‌ ఇంటికే శ్రద్ధ మకాం మార్చిందని.. అయితే ఆమె తండ్రి శక్తికపూర్‌ బలవంతంగా తిరిగి ఆమెను వెనక్కి తీసుకొచ్చినట్టుగా కొద్దిరోజుల క్రితం పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్ల పై స్పందించిన శ్రద్ధని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
‘‘ ఇలాంటి కట్టుకథలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మొదట్లో ఈ పుకార్లను పట్టించుకొని బాధపడేదాన్ని. ఈ రూమర్లపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. మనచుట్టూ పుట్టుకొచ్చే ఈ వూహాజనిత వార్తలను నియంత్రించడం కొన్నిసార్లు సాధ్యపడదు. అందుకే వీటిపై స్పందించి సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకున్నా. అందుకే నాపై వచ్చే పుకార్లను పట్టించుకోవడం మానేశా. వాటి గురించి ఆలోచించడం మానేసి కేవలం నా పని మీద మాత్రమే ఫోకస్‌ చేయాలని అనుకుంటున్నా.’’ అని శ్రద్ధాకపూర్‌ చెప్పుకొచ్చింది.