Social Technology

ఫేస్ బుక్ ఆగిపోయిందోచ్..!

సోషల్‌మీడియా కింగ్ ఫేస్‌బుక్‌ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మంగళవారం ఉదయం పలు దేశాల్లో ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఫేస్‌బుక్‌ తెరిచేందుకు ప్రయత్నించిన చాలామందికి ‘సారీ.. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అంటూ ఓ మెసేజ్‌ రాడంతో షాక్‌ తిన్నారు.
ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌.. మెసెంజర్‌ యాప్‌సైతం మొరాయించాయి. అయితే.. వెంటనే అప్రమత్తమైన తమ నిపుణులు.. కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించారని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.
డౌన్‌డిటెక్టర్‌.కామ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా.. మెక్సికో.. మలేషియా..ఇండోనేషియా.. జపాన్‌.. ఆస్ట్రేలియాలోని కొన్ని చోట్ల ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలిసింది. భారత్‌లో అతికొద్ది మంది మాత్రమే ఇబ్బంది పడ్డారని అంటోంది.