Featured2 Latest News Technology

ఫ్లయింగ్ కారు వచ్చేస్తోంది. ధర 10 కోట్లు..!

రోడ్ పై నడిచే…గాల్లో ఎగిరే ఫ్లయింగ్ కారు వచ్చేస్తోంది. స్లోవాకియాకు చెందిన ఏరోమొబిల్‌ అనే ఆటోమొబైల్‌ సంస్థ కమర్షియల్‌ డిజైన్‌లో ఫ్లయింగ్‌ కారును తీసుకొచ్చింది. మొనాకోలో జరిగిన ఆటోషోలో ఈ కారును ఏరోమొబిల్‌ ఆవిష్కరించింది మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ కారు ఫ్లయింగ్‌ మోడ్‌లోకి మారుతుందని తెలిపింది. అలాగే రోడ్లుపై వెళ్తున్నప్పుడు కారు మాములు స్థితికి వస్తుంది. త్వరలోనే ఈ కారు ముందస్తు ఆర్డర్లు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. 2020 నాటికి కార్లను డెలివరీ చేస్తామని పేర్కొంది.తొలి ఎడిషన్‌లో భాగంగా 500 కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది ఏరోమొబిల్‌. వీటి ధర 1.29 మిలియన్‌ డాలర్ల నుంచి 1.61 మిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. అంటే భారత కరెన్సీలో రూ. 8 కోట్ల నుంచి రూ. 10కోట్ల మధ్య ఉంటుంది.