Latest News Sports

బజ్జీ గారాలపట్టి భల్లే భల్లే…

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ మంచి స్నేహితులు. గ్రౌండ్ లోనే కాదు బయట సరదాగా ఉంటారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ తర్వాత బజ్జీ గారాల పట్టి హినయా హీర్‌ను ఎత్తుకొని కోహ్లీ సందడి చేశాడు.
చిన్నారితో కలిసి ఫొటోలు దిగాడు. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘నా గెడ్డాన్ని పట్టుకొని అందులో ఏదో ఉందని హినయా చూస్తోంది. ఎంతో ముద్దొస్తుంది ఈ చిట్టితల్లి’ అంటూ కోహ్లీ కామెంట్‌ కూడా పెట్టాడు.