Sports

బాల్ స్టంప్స్ తాకి బెయిల్స్ కిందపడకపోతే…

క‌్రికెట్‌లో బంతి స్టంప్స్‌ను తాకి బెయిల్స్ కింద ప‌డితేనే అంపైర్ ఔటిస్తాడు. కానీ ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఓ క్ల‌బ్ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం అంపైర్లకు ఊహించని సంఘటన ఎదురైంది. బౌల‌ర్ విసిరిన బంతికి మిడిల్ స్టంప్ ఎగిరి ప‌డింది. కానీ దానిపై ఉన్న బెయిల్స్ మాత్రం క‌ద‌ల్లేదు.. కింద ప‌డ‌లేదు. దీంతో అంపైర్‌కు ఏం చేయాలో తోచ‌లేదు. చాలాసేప‌టి వ‌ర‌కు లెగ్ అంపైర్‌, థ‌ర్డ్ అంపైర్ల‌తో చ‌ర్చించి ఔటిచ్చాడు. మెల్‌బోర్న్‌లో మూనీ వాలీ సీసీ, స్ట్రాట్‌మోర్ హైట్స్ సీసీ టీమ్స్ మ‌ధ్య జ‌రిగిన క్ల‌బ్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ వింత జ‌రిగింది. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇంత‌కుముందు ఎప్పుడూ ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంపైర్లు కూడా ఔటివ్వాలా వ‌ద్దా అన్న విష‌యంపై తిక‌మ‌క‌ప‌డ్డారు. అప్ప‌టిక‌ప్పుడు క్రికెట్ రూల్ బుక్ చూసి.. అంపైర్లు చెప్ప‌డంతో రెండు టీమ్స్ బ్యాట్స్‌మ‌న్ ఔటైన‌ట్లు ఒప్పుకున్నాయి.