Featured Movies

బాహుబలికి 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్!

 

 

 

 

 

 

 

 

 

 

టాలీవుడ్ మోస్ట్ ఎలీజబుల్ బ్యాచిలర్ ప్రభాస్.. డార్లింగ్ పెళ్లి ఎప్పుడెప్పుడా అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ అరడుగుల బుల్లెట్ కు ఎన్ని పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..వంద కాదు రెండువందలు కాదు..ఏకంగా 6 వేలు..

బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో స్టార్‌డ‌మ్ తెచ్చకున్న ప్ర‌భాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్ లోనూ ఈ సినిమా కోసం ఐదేళ్లు త్యాగం చేసిన ప్ర‌భాస్‌.. చివ‌రికి త‌న పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఐదేళ్ల‌లో ప్ర‌భాస్‌కు ఏకంగా ఆరు వేల పెళ్లి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ట‌. బాహుబ‌లి కోసం సైన్ చేసిన‌పుడే.. ఈ ఐదేళ్లూ పెళ్లికి దూరంగా ఉండాల‌ని ప్ర‌భాస్ డిసైడ‌య్యాడు. దీంతో ఇన్ని వేల ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చినా అత‌ను మాత్రం దేనికీ ఓకే అనలేదు. ఇప్పుడు బాహుబ‌లి సూపర్ సక్సెస్ తో ఈ ఏడాది ప్ర‌భాస్ పెళ్లి పీటలెక్కే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌ని పెద‌నాన్న కృష్ణంరాజు కూడా ఈ విష‌యాన్ని ఇంత‌కుముందే చెప్పారు.మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాల్సిందేనని అంటున్నాడు.