Movies

బాహుబలి టీమ్ కు పవన్ కంగ్రాట్స్

 

 

 

 

 

 

 

 

 

వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన వాల్డ్ ఫిల్మ్ విజువల్ వండర్ బాహుబలి 2 మరిన్ని రికార్డులను సాధిస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాశానికి ఎత్తారు. కాని తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాపించేలా చేసిన బాహుబలి 2 చిత్రంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం చర్చలకు దారి తీసింది. కొందరు విమర్శకులు ఈ సినిమా పవన్ కి నచ్చని కారణంగానే రెస్పాండ్ కాలేదంటూ పుకార్లు పుట్టించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాహుబలి2 సినిమాపై ట్వీట్ వేశారు. బాహుబలి 2 చిత్రం వెయ్యి కోట్లు సాధించినందుకు చిత్ర దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ మరియు ఇతర టీం సభ్యులకు హార్ట్ ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్స్ కోసం ఎంతో డెడికేషన్ తో వర్క్ చేసిన టీం బాహుబలి 2 సినిమాతో మనం అందరు గర్వపడేలా చేసింది. రానున్న రోజుల్లో ఇలాంటి ఎచీవ్ మెంట్స్ మరెన్నో సాధించాలి. రానా, ప్రొడ్యూసర్స్, ఇతర టెక్నికల్ టీంకి కూడా నా శుభాకాంక్షలు అని పవన్ తెలిపాడు.