Featured Movies

బాహుబలి-2 కోసం 350 టికెట్లు బుక్ చేయించిన కలెక్టర్ అమ్రపాలి


బాహుబలి 2 మేనియా తెలుగురాష్ట్రాల్ని ఊపేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లోనూ ఈ ఫీవర్ ఉంది. 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. థియేటర్ల ముందు ప్రేక్షకులు భారీగా బారులు తీరారు. ఈ తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా ఒక్కరే 350 టికెట్లు బుక్ చేయించడం చర్చనీయంశమైంది. వరంగల్ ఆర్డీవో ద్వారా బాహుబలి-2 సినిమాటికెట్లు బుక్ చేయించారామె. ఇన్ని టికెట్లు ఎందుకంటే…

కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. హన్మకొండలోని ఏసియన్ మాల్‌లో 28న వారంతా ఫస్ట్‌ షో చూడనున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.