Movies

బాహుబలి 2 ను మరిపించేలా మెగా మూవీ 151..!

 

 

 

 

 

 

 

 

 

చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.చిరంజీవి లుక్ ను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నారు.
బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ఓ వీర యోధుడి కథ ఇది. ముఖ్యమైన సన్నివేశాలను తీయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో భారీ సెట్ ను వేస్తున్నారు. 100 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించాలని రామ్ చరణ్ భావించాడు. బాహుబలి 2 ను మరిపించేలా ఈ సినిమా తీయాలనుకుంటున్నారట.

‘బాహుబలి 2’ సినిమాలో యుద్ధ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. భారీ ఖర్చుతో అభిమానులు ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్ వర్క్ చేయించారు. మున్ముందు రానున్న సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు ఆ స్థాయిలో లేకపోతే ప్రేక్షకులు అంతగా సాటిస్ఫై కారు. అందువల్లనే చరణ్ గ్రాఫిక్స్ కోసం మరింత ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట. అనుకున్న బడ్జెట్ కు మరో 25 కోట్లను అదనంగా ఖర్చు చేయడానికి చెర్రీ రెడీ అయ్యాడు.