Movies

‘బాహుబలి 2’ సెట్స్‌లో ఫ్లాట్‌ కావాలి

 

 

 

 

 

 

‘బాహుబలి-2’ సినిమా చిత్రీకరణ జరిగిన ప్రదేశంలో ఫ్లాట్‌ కొనుక్కుంటానంటున్నారు బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌. ఆయన ఆదివారం ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ సినిమా చూశారట. ఈ సినిమాలో వేసిన సెట్స్‌ చాలా బాగున్నాయని, చిత్రీకరణ ఎక్కడ జరిగిందో చెపితే ఓ ఏజెంట్‌ ద్వారా 2 బీహెచ్‌కే ఫ్లాట్‌తీసుకుంటానంటూ సరదాగా ట్వీట్‌ చేశారు.
‘బాహుబలి 2 చూస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వెల్‌. సినిమా గురించి తర్వాత ట్వీట్‌ చేస్తాను. అసలు ఈ సినిమా చిత్రీకరణ ఎక్కడ జరిగిందో తెలుసా? నాకు ఆ సెట్స్‌లో డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ కావాలి. ఎవరైనా ఏజెంట్‌ ఉన్నాడా? ‘బహు’త్‌‘బలి’యా(బహుత్‌ అంటే చాలా, బలియా అంటే మిద్దెలు) ఎక్కాలి ఈ సినిమా విజయ స్థాయిని ఇతర చిత్రాలు అందుకోవాలంటే. ఇది భారతీయ ఉత్సవం. ఈ తరహా సినిమాలు వస్తున్న ఇండస్ట్రీలో నేనూ ఉన్నందుకు గర్విస్తున్నాను’ అని రిషి ట్వీట్‌ చేశారు.