Latest News Politics

బిల్లు ఎగ్గొట్టాడు..అడ్డంగా బుక్కయ్యాడు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ కరెంట్‌ బిల్లు ఎగ్గొట్టాడు. ఈ విషయం చిన్న ప్రమాదంతో బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఇటావాలోని ములాయం ఇంట్లో ఎలక్ట్రిక్‌ మీటర్‌లో గురువారం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న విద్యుత్‌ సిబ్బంది మంటలు అదుపు చేశారు. తర్వాత మీటర్‌ చెక్‌ చేయగా అది కేవలం 5 కిలోవాట్ల విద్యుత్‌ సరఫరా చేసే మీటర్‌ అని గుర్తించారు. ములాయం మాత్రం 40 కిలోవాట్ల విద్యుత్‌ వాడుతున్నట్లు తెలిసింది. కరెంటు బిల్లు కూడా 5 కిలోవాట్లకు మాత్రమే కడుతుండడంతో.. ఆయన రూ.4లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో విద్యుత్‌ సిబ్బంది పాత మీటర్‌ స్థానంలో 40 కిలోవాట్ల మీటర్‌ ఏర్పాటు చేశారు. బకాయి పడ్డ రూ.4లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఓ పార్టీ అధినేత కరెంట్ బిల్లు కోసం ఇలా కక్కుర్తిపడటం జనాన్ని నివ్వెరపరిచింది.