Featured Health Latest News

బొద్దుగుమ్మకు కొత్త కష్టాలు… చికిత్స చేయబోమన్న డాక్టర్లు..ఎందుకంటే..?

 

 

 

 

 

 

 

 

ప్రపంచంలోనే అత్యంత బరువుతో బాధపడుతున్న మహిళ ఎమాన్‌ అహ్మద్‌కు కొత్త చిక్కులు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ముంబయిలోని సైఫీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కూడా ఎమాన్‌ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటెన్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఎమాన్‌ చికిత్స విషయంలో డాక్టర్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమాన్‌ సోదరి షైమా ఆరోపణలు చేసింది. దాంతో ఎమాన్‌కు వైద్యం చేస్తున్న 13 మంది వైద్య బృందంలో 12 మంది ఇక చికిత్స చేయబోమంటూ తప్పుకున్నారు.
రిస్కైనా ఎమాన్‌కి బేరియాట్రిక్‌ సర్జరీ చేస్తూ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య వివరాలు బహిర్గతం చేస్తుంటే అవన్నీ అబద్ధాలేనంటూ ఆమె సోదరి అవమానపరిచారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇక ఎమాన్‌కి ఏదైనా అవసరమున్నప్పుడే వస్తాం కానీ ఎల్లప్పుడూ ఆమెతోనే ఉంటూ వైద్యం చేసేదిలేదంటూ సైఫీ హాస్పిటల్‌ యాజమాన్యానికి రాజీనామా పత్రాలు ఇచ్చారు.
ఎమాన్‌ని ఎక్కడ తిరిగి ఈజిప్ట్‌కి తీసుకెళ్లాల్సి వస్తుందోనని ఆమె సోదరి ఇలా మాట్లాడుతోందని వైద్యులు ఆరోపించారు. ప్రస్తుతం ఎమాన్‌ 171 కిలోలు బరువు ఉన్నట్లు సమాచారం.