crime Latest News

బ్యూటీషియన్‌పై గ్యాంగ్‌రేప్..నిందితుల్లో ఎమ్మెల్సీ పుత్రుడు


హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. హైదరాబాద్ శివారు కొంపల్లిలోని ఫాం మెడోస్‌లో బంజారాహిల్స్‌కు చెందిన 23 ఏళ్ళ బ్యూటీషియన్‌పై గ్యాంగ్‌రేప్ జరిగింది. ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రీతంరెడ్డి, అరవరెడ్డి అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుల్లో ఒకరైన ప్రీతం.. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కొడుకని సమాచారం.

బంజారాహిల్స్‌లో పని చేస్తున్న బ్యూటిషియన్‌కు ఓ యువకుడికి కొద్ది నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కొంపల్లికి యువతిని పిలిపించుకుని అతని స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. శనివారం రాత్రి ఎస్‌ఆర్‌నగర్‌లో యువతిని వదిలేసిన యువకుడు.. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. తనకు జరిగిన అవమానం భరించలేక బాధిత బ్యూటిషియన్ ఎట్టకేలకు నోరు విప్పింది. పేటబషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.