Health Latest News

మసాజ్… ప్రాణం తీసింది..

బాడీపార్ట్స్ లో ఎక్కడైనా నొప్పి అనిపిస్తే మసాజ్ చేయించుకోవడం కామన్..ఈ మసాజ్ ఎలా పడితే అలా.. ఎక్కడి పడితే అక్కడ చేయించుకోవద్దు..ఇలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. ఢిల్లీలో ఓ తల్లి చేసిన మసాజ్ కొడుకు ప్రాణం తీసింది.

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువకుడు గతేడాది బ్యాడ్మింటన్‌ ఆడుతూ పడిపోవడంతో ఎడమ కాలు విరిగింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కట్టుకట్టారు. అయితే కాలు నొప్పి తగ్గకపోగా.. ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టి నొప్పి మరింత ఎక్కువైంది. నొప్పితో బాధపడుతుంటే చూడలేక తల్లి అతని కాలుకి మసాజ్‌ చేసింది. దాంతో గట్టకట్టిన రక్తం వూపిరితిత్తుల దాకా చేరి అతను స్పృహకోల్పోయాడు. అప్పటిదాకా బాగానే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి పడిపోవడంతో వెంటనే కుమారుడిని ఎయిమ్స్‌కి తరలించింది.దురదృష్టవశాత్తు అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం చేశారు.
కాలిలో రక్తం గడ్డకట్టినప్పుడు మసాజ్‌ చేయడంతో అది కాస్తా వూపిరితిత్తుల దాకా చేరి ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. అది విని తన కుమారుడిని తన చేతులతో తానే చంపుకున్నానని తల్లి గుండెలావిసేలా విలపిస్తోంది.
సో మసాజ్ చేయించుకునేటప్పుడు జరజాగ్రత్త. లేదంటే ప్రాణాలకే ముప్పు వస్తుంది.