Featured2 Latest News Social

హైదరాబాద్ లోని మాదాపూర్‌ లో ఓ వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నానికి చెందిన మూగి అనూష(25) నగరంలోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఫిజియోథెరపి వైద్యురాలిగా పనిచేస్తూ అమీర్‌పేటలో నివాసం ఉండేది. మూడు రోజుల క్రితం మాదాపూర్‌ హైటెక్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న అతిథి హాస్టల్‌లో చేరింది. గురువారం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో సాయంత్రం 4.30 ప్రాంతంలో వసతి గృహం నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ క‌నిపించింది.