Politics

మిడిల్ క్లాస్ వాళ్లకోసమే ‘ఉడాన్’ విమానాలు!

 


ఉడాన్ సర్వీస్‌లో రూ.2,500 ఖర్చుతో గంటలోపు ప్రయాణం చేయవచ్చని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఉడాన్ విమానంలో ఇపుడు ఢిల్లీ నుంచి షిమ్లాకు రూ.2500 ఖర్చుతో వెళ్లొచ్చన్నారు.
ఉడాన్ విమాన స‌ర్వీసుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లే ఫ్ల‌యిట్‌కు ఆయ‌న పచ్చజెండా ఊపారు. ఉడాన్ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లే విమాన టికెట్ ధ‌ర కేవ‌లం రూ.2500 మాత్ర‌మే. అతి త‌క్కువ ధ‌ర‌కు విమాన స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఉడాన్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఉడాన్ (యూడీఏఎన్‌) అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగ‌రిక్. జాతీయ పౌర విమాన‌యాన ప‌థ‌కం కింద ఉడాన్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 500 కిలోమీట‌ర్ల దూరానికి లేదా 30 నిమిషాల జ‌ర్నీకి కనీసం రూ.2500 ఛార్జ్ చేస్తున్నారు. ఉడాన్ స్కీమ్ కింద పశ్చిమ ప్రాంతంలో 24, ఉత్తర ప్రాంతంలో 17, ద‌క్షిణ ప్రాంతంలో 11, తూర్పు ప్రాంతంలో 12 విమానాశ్రయాల‌ను అనుసంధానం చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 45 విమానాశ్ర‌యాల‌ను క‌ల‌పాల‌న్నదే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశం. కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య కూడా ఉడాన్ సేవలు మొదలు కానున్నాయి.