Featured FOOD Health

మినరల్ వాటర్ బాంబ్

మంచినీళ్లంటే మినరల్ వాటర్. ప్రయాణాల్లో దాహమెస్తే ఠక్కున మినరల్ వాటర్ బాటిల్ కొంటాం..మంచి స్వచ్ఛమైన నీళ్లనుకుంటాం.. ఆరోగ్యానికి మంచిదనుకుంటాం..కానీ మినరల్ వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేవో చూడం..దాహం తీరిందా లేదా చూస్తాం… కానీ ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు.
నీళ్లలోని మినరల్స్‌ను జీరో చేస్తున్నాయి ఆర్వో వాటర్‌ కంపెనీలు. లేదంటే తక్కువ పిపిఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) పెడుతున్నాయవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పిపిఎం ఉండాలి. కానీ, మనకు బయట దొరికే వాటర్‌ బాటిళ్లలో పది నుంచి ఇరవై పిపిఎం మాత్రమే ఉంటోంది. ఇలాంటి నీళ్లు ఆరోగ్యానికి హానికరం. మా ఆర్వో వాటర్‌లో 150 పిపిఎం ఉంటుంది. టోటల్‌ డిజాల్డ్వ్‌ సాలిడ్స్‌ (టిడిఎస్‌) మీటర్లను కొనుక్కుని నీళ్లలో పెట్టి చూస్తే.. ఖనిజాలు, లవణాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఈ మీటర్లు ఆన్‌లైన్‌లో అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. ఇక, పిహెచ్‌ (పవర్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌) విషయానికి వస్తే – 7.5 నుంచి 8.5 పిహెచ్‌ ఉండాలి. మార్కెట్‌లో దొరికే బాటిల్స్‌ నీళ్లలో 6.5 పిహెచ్‌ మాత్రమే ఉంటోంది. తక్కువుంటే ఎసిడిక్‌, ఎక్కువుంటే ఆల్కహాలిక్‌ అవుతాయి నీళ్లు. నిబంధనలకు విరుద్ధంగా శుద్ధిచేసిన నీటిని తాగితే – కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం.. ఇతర జబ్బులు తప్పవు.
ఇక అసలు విషయం ఏంటంటే…రంగు, రుచి లేని నీళ్లే శుభ్రమైనవి. ఈ మధ్య కొన్ని బహుళజాతి సంస్థలు నీళ్లను కూడా ఎడిక్ట్‌ చేసేందుకు – అందులో పొటాషియం కలుపుతున్నాయి. ఆ నీళ్లు రుచిగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచివి కావట.
సో ఇప్పటికైనా మినరల్ వాటర్ బాటిల్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి. రంగు రుచి లేని నీళ్లే తాగుతారో… ఆరోగ్యానికి హానికరమైన మినరల్స్ లేని నీళ్లే తాగుతారో మీరే తేల్చుకోవాలి.