Featured2 Trends

మిస్‌ టీన్‌ యూనివర్స్‌గా నోయిడా అమ్మాయి

 

మిస్‌ టీన్‌ యూనివర్స్‌-2017గా నోయిడా అమ్మాయి సృష్టి కౌర్‌ ఎంపికైంది. ఆరేళ్లుగా మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులే ఈ మిస్‌ టీన్‌ యూనివర్స్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. 15నుంచి 19మధ్య వయసు గల యువతులు ఈ పోటీలకు అర్హులు.
మనగ్వా రాజధాని నికరగ్వలోని రూబెన్‌ డారియో నేషనల్‌ థియేటర్‌లో నిర్వహించిన ఫైనల్‌ పోటీలో సృష్టి కౌర్‌ 25మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. కెనడాకు చెందిన సమంత పిర్రే, మెక్సికోకు చెందిన అరి ట్రావ రన్నరప్‌లగా నిలిచారు. బెస్ట్‌ నేషనల్‌ కాస్ట్యూమ్‌ అవార్డును కూడా కౌర్‌ గెలుచుకుంది. భారత జాతీయ పక్షి నెమలి అలంకరణలో ప్రదర్శన ఇచ్చిన కౌర్‌ పలువుర్ని ఆకట్టుకుంది. లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో సృష్టి చదువుతోంది.