Featured2 Politics

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రభుత్వ అధికార సమావేశంలో సాక్షాత్తూ ఓ ముస్లిమ్ ఉన్నతాధికారి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. మొరాదాబాద్ నగరంలోని ఓ పంచాయతీ భవన్‌లో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న యూపీ రాష్ట్ర సమాచార కమిషనర్ హాఫిజ్ ఉస్మాన్ మాట్లాడుతూ రెండు చేతులు పైకెత్తి ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. ప్రజలు కూడా ఆయనతో జై శ్రీరాం అంటూ గొంతు కలపడంతో ఆయన మరోసారి ‘భారత్ మాతాకీ జై ’ అంటూ హాపిజ్ ఉస్మాన్ నినాదాలతో హోరెత్తించారు. పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సౌదీ అరేబియా దేశం విధించిన సెన్సార్ షిప్ పై విమర్శలు గుప్పించారు. ప్రజలకు స్వేచ్ఛ కల్పించిన ఏకైక దేశం ఇండియా అని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ సమస్యపై కూడా ఆయన స్పందించారు. “ఎందుకు ట్రిపుల్ తలాక్, ఒక తలాక్ కూడా తప్పు” అని ఉస్మాన్ పేర్కొన్నాడు. ట్రిపుల్ తలాక్ కారణంగా మహిళలు బాధపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.