Latest News Movies

మెగా ఇంట్లో సందడి


కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ తొలి వార్షికోత్సవ సంబురాలు హైదరాబాద్‌లో చిరు ఇంట ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు. చిరంజీవి 151వ చిత్రం కూడా కొణిదెల సంస్థలోనే ఉండబోతోంది. ఈ సినిమాకి సురేందర్‌రెడ్డి దర్శకుడు. ‘‘మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్‌రెడ్డికి స్వాగతం’’ అంటూ ఆహ్వానించారు చరణ్‌.
ఇక ఇటీవల విడుదలైన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు చిరంజీవి. ‘‘ఈ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి ఎంతైనా అభినందనీయుడు. తెలుగు వారి సత్తా విదేశాల్లో చాటిన అద్భుత శిల్పి జక్కన్న. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అభినందిస్తున్నా’’ అన్నారు చిరంజీవి.