Latest News

మొక్క‌లు తినే జింక‌.. బొక్క‌లు కొరికితే…

శాకాహారైనా జింక మొక్కలు తినబోయి కనిపించిన బొక్కల్ని కొరికింది. మ‌నిషి ప‌క్క‌టెముక‌లు తింటూ క‌నిపించింది. టెక్సాస్‌లోని శాన్‌ మార్కోస్‌లో క‌నిపించిందీ ఈ దృశ్యం. మ‌నిషి మృత‌దేహం ఎలా కుళ్లిపోతుందో తెలుసుకోవ‌డానికి అక్క‌డి ఫోరెన్సిక్ ఆంత్రోపాల‌జీ రీసెర్చ్ సెంట‌ర్‌.. డొనేటెడ్ బాడీల‌ను కావాల‌నే 26 ఎక‌రాల స్థలంలో ఉంచుతారు. సాధార‌ణంగా క్రూర మృగాల బారిన ప‌డ‌కుండా ఈ మృత‌దేహాల‌ను బోనుల్లో ఉంచుతారు. కొన్నిసార్లు ఎలాంటి జంతువులు మ‌నిషి మృత‌దేహం ద‌గ్గ‌రికి వ‌స్తున్నాయో చూడ‌టానికి ఇలా వ‌దిలేస్తారు. సాధార‌ణంగా ఎలుక‌లు, న‌క్క‌లు, కుందేళ్లు వ‌స్తుంటాయి. కానీ ఓ జింక అక్క‌డి కుళ్లిపోయిన మృత‌దేహం ప‌క్క‌టెముక‌లు తింటూ క‌నిపించ‌డం కెమెరాలు క్లిక్‌మ‌నిపించాయి.