Latest News Social

మ్యాచ్ కోసం మగవేషాలు..!

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించడానికి ఇరాక్‌కి చెందిన ఎనిమిది మంది మహిళలు మగవేషంలో స్టేడియంకు వెళ్లారు. ఇస్లాం చట్ట ప్రకారం ఇరాక్‌లో ముస్లిం మహిళలు లైవ్‌ మ్యాచ్‌లను వీక్షించడానికి వీల్లేదు. దీంతో ఎలాగైనా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వెళ్లాలన్న ఆశతో మహిళలు మగవారిలా వేషాలు మార్చుకున్నారు. వారి వేషధారణపై అనుమానం వచ్చి టెహ్రాన్‌ ఆజాది స్టేడియంలోని అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

మహిళల రక్షణ కోసమే వారి లైవ్‌ మ్యాచ్‌లను వీక్షించడంపై బ్యాన్‌ విధించినట్లు పేర్కొన్నారు. స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించడమే కాదు అక్కడి చట్ట ప్రకారం వారు సైక్లింగ్‌ కూడా చేయకూడదు. ఇరాక్‌కి చెందిన సుప్రీం నేత అలీ ఖామెనేయ్‌.. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ద్విచక్రవాహనాలు నడపకూడదని అలా చేస్తే పురుషులు వారికి ఆకర్షితులవుతారని ఫత్వా జారీ చేశారు.