Movies

యుఎస్ వీసాకు సోషల్ లింక్..!

 

 

 

 

 

 

 

 

 

అమెరికా వెళ్లబోయే వారు తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియా ఖాతలకు వీసాకు లింకు పెట్టబోతున్నారు. వీసా దరఖాస్తు చేసుకున్న వారిపై ఇక నుంచి స్థానిక వీసా ప్రతినిధులు కొత్త కోణంలో దర్యాప్తులు చేపట్టనున్నారు. దరఖాస్తుదారుడి ఫేస్‌బుక్‌, ఈ మెయిల్‌ ఐడీ తదితర వివరాలను వీరు పరిగణలోకి తీసుకుని వీసా జారీ చేస్తారు.
ఈ కొత్త నిబంధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 65వేల మంది దరఖాస్తుదారులపై ప్రభావం ఉండవచ్చని యూఎస్‌ స్టేట్‌ డిపార్టుమెంట్‌ ప్రతినిధులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై కొంతకాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లుగా పలువురు తెలిపారు. వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్లు చెప్పారు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పాస్‌పోర్టు సంఖ్యతో పాటు ఐదేళ్లుగా వాడుతోన్న సోషల్‌మీడియా ఖాతాలు.. ఈమెయిల్‌ ఐడీ.. ఫోన్‌ నెంబర్లతో పాటు 15ఏళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి.
అయితే.. సోషల్‌ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను కౌన్సిలర్‌ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలకు ట్రంప్‌ వర్గం ఆమోదం తెలిపితే మే 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.