Featured Politics

యోగి..సూపర్ సీఎం!

 


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ..జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. పాలనలో మెరుగైన సంస్కరణలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బుధవారం రాత్రికి రాత్రే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యోగి భారీగా ఐపీఎస్‌ ఆఫీసర్లను బదిలీ చేశారు. 41 జిల్లాల పోలీసు బాస్‌లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు.
సుమారు 50మందికిపైగా అధికారులకు స్థాన భ్రంశం కల్పించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల పోలీస్‌ బాస్‌లను బదిలీ చేయడం ద్వారా పెద్ద సంస్కరణకు యోగి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద పోలీస్‌ సంస్కరణగా నిలిచింది.ముఖ్యంగా మెయిన్పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్‌పీలను బదిలీ చేసింది. మెయిన్‌ పురి జిల్లాకు కొత్త పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ రాజేష్ నియమితుడయ్యారు.
అలాగే బీజేపీ ఎమ్మెల్సీ నేతృత్వంలోని ఊరేగింపు నిషేధించి ఇటీవల వార్లల్లో నిలిచిన షహరన్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ లవ్‌కుమార్‌ను నోయిడాకు ట్రాన్సఫర్‌ చేయగా, రాయబరేలికి గౌరవ్‌ సింగ్‌, లక్నోకు దీపక్‌కుమార్‌, ఆగ్రాకు దినేష్‌​ చంద్ర దుబే పోలీస్‌ ఛీప్‌గా వ్యవహరించనున్నారు. మునుపటి సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్‌ లలో ఎక్కువమందిని రీ షఫిల్‌ చేయడ విశేషం.