Movies

రజనీతో జక్కన్న సినిమా..?


‘బాహుబలి’ సిరీస్‌తో రాజమౌళి ఆల్‌ ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లు సైతం ‘రాజమౌళితో సినిమా చేయాలనివుంది’ అంటూ బాహాటంగానే ప్రకటించేశారు. ఇప్పుడు రజనీకాంత్‌ దృష్టి కూడా రాజమౌళిపై పడిందని సమాచారం. ‘ఈగ’ సమయంలోనే రాజమౌళి – రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్నదని చెప్పుకొన్నారు. ఇప్పుడు కూడా అలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. ‘బాహుబలి 2’ చూసి ట్విట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు రజనీ. రాజమౌళిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. రజనీ కామెంట్లకు రాజమౌళి కూడా పొంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి నుంచి ఓ సినిమా వచ్చే అవకాశం ఉందంటూ తమిళ చిత్రసీమలో గాసిప్పులు వెల్లువెత్తాయి. ఒకవేళ రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే… అందులో ద్రోణాచార్య పాత్రకు రజనీకాంత్‌ సరిగ్గా సరిపోతాడని రజనీ అభిమానుల కూడా భావిస్తున్నారు. మరోవైపు ‘పదేళ్ల వరకూ మహాభారతం తీసే ప్రసక్తి లేదంటూ “తప్పించుకొంటున్నాడు రాజమౌళి. రజనీతో చేస్తే ఎప్పట్లా మాస్‌ సినిమానే చేయాలి. మరి అందుకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో చూడాలి?