Featured Politics

రజనీ..రాజకీయాల్లోకి వస్తే…

 

 

 

 

 

 

 

 

 

వెటరన్ యాక్ట్రెస్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నగ్మా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఆయన స్వగృహంలో కలిశారు. రాజకీయాలు తప్ప అనేక విషయాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీరి సమావేశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నగ్మా మీడియాతో మాట్లాడుతూ నేను పొలిటికల్ రీజన్స్ కారణంగా తలైవాని కలవలేదు.. కేవలం మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి అంటూ తెలిపింది. కాని రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తే మాత్రం మంచి విజయం సాధిస్తారు అంటూ నగ్మా తన ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.