Featured Latest News

రాకెట్ లాంచర్లతో దెబ్బకొట్టారు…

 

 

 

 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోలు సృష్టించిన బీభత్సం గురించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ సీఆర్పీఎఫ్‌ జవాన్లు దాడి గురించి వివరిస్తున్నారు.

దాడిలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నారని.. రాకెట్‌ లాంచర్లు, గ్రనేడ్లు, క్రూడ్‌ బాంబులతో దాడి చేసినట్లు క్షతగాత్రులు తెలిపారు. వారి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని చెబుతున్నారు. దాడికి ముందు మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ఉండే ప్రాంతాన్ని పరిశీలించి రమ్మని స్థానికులను పంపించినట్లు క్షతగాత్రుల్లో షేర్‌ మహమ్మద్‌ అనే వ్యక్తి తెలిపారు. దాడిలో 300 మంది వరకు పాల్గొన్నారని.. నల్ల దుస్తులు ధరించి వచ్చారని చెప్పారు. దాడి చేసిన వారిలో చాలా మందిని తాము చంపినట్లు సీఆర్పీఎఫ్‌ జవాన్లు చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం సుకమా జిల్లాలోని చింతగుహ నుంచి బురకాపాల్‌ మధ్య గస్తీ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 25మంది జవాన్లు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.