Latest News Movies

బాలీవుడ్ భామ బంతికి జహీర్..క్లీన్ బౌల్డ్!

 

టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ ఖాన్‌కి నిశ్చితార్థం అయిపోయింది. కొంతకాలంగా బాలీవుడ్‌ భామ సాగరిక ఘటెతో ప్రేమాయణం సాగిస్తున్న 38 ఏళ్ల జహీర్‌.. ఆమెతో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించాడు. ‘‘మీ భార్య ఎంపికల్ని చూసి నవ్వకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమే. జీవితాంతం భాగస్వాములమే’’ అని ట్వీట్‌ చేసిన జహీర్‌ ‘నిశ్చితార్థం అయింది’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జోడించాడు. జహీర్‌.. సాగరికతో కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. అందులో సాగరిక తన వేలికి ఉన్న ఉంగరంతో ఫొటోకు పోజిచ్చింది.