Featured Social

రూ.10 కాయిన్స్ ..బ్యాక్ ఇన్ బ్యాంక్స్.. వదంతులతో 6 లక్షల నాణేలు వెనక్కి…

 

 

 

 

 

 

 

 

 

 

టెన్ రూపీస్ కాయిన్ కనిపడదంటే జాగ్రత్తగా దాచుకునేవాళ్లం..పిల్లలకు ఇస్తే ముచ్చటపడి కిడ్డీ బ్యాంకులో వేసుకునే వారు. ఇప్పుడు పది రూపాయల బిళ్ల అంటే అమ్మో మాకొద్దంటున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకు శాఖల్లో ఏకంగా 6 లక్షల నాణేలను జమ చేసేశారు.
సోషల్ మీడియా పుణ్యమా అని రూమర్స్ తుఫాన్ కన్నా ఎక్కువ వేగంతో జనాల్లోకి దూసుకెళ్తున్నాయి. నకిలీ నాణేలు వస్తున్నాయన్న ప్రచారం ఒకవైపు.. రూ. 10 నాణేలు భవిష్యత్తులో చెల్లవన్న వదంతులు మరోవైపు విజృంభించడంతో గందరగోళం ఏర్పడింది. ఎక్కడ చూసినా రూ. 10 నాణేల పేరు చెబితే అమ్మో అనే పరిస్థితి. బజార్లు, దుకాల్లో సైతం వాటిని తీసుకోవటం మానేశారు. బస్సుల్లో తీసుకుంటున్నా… తిరిగి జనానికి చిల్లర ఇచ్చే సమయంలో ఇస్తుంటే వద్దంటున్నారు. కొందరు ప్రయాణికులు కండక్లర్లతో గొడవకు కూడా దిగుతున్నారు.
ఈ నాణేలు మారతాయని భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసినా, బ్యాంకుల
సమన్వయ అధికారి పదేపదే చైతన్యపరుస్తున్నా జనం వినడం లేదు. చివరకు విద్యుత్తు, తపాలాలాంటి ప్రభుత్వరంగ సంస్థల్లోనూ బిల్లులు చెల్లించేటపుడు జనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు జనం ఇన్నాళ్లూ ముచ్చటపడి దాచుకున్న నాణేలన్నింటినీ బయటకు తెచ్చి బ్యాంకుల్లో జమ చేసేశారు.
వదంతులనే నమ్మేసిన జనం బ్యాంకుల్లో ఆరు లక్షల రూ. 10 నాణేలు జమ చేసేశారు. అంటే రూ. 60 లక్షల నగదన్నమాట. పెద్దనోట రద్దు తరువాత చిల్లర కొరతను తీర్చడంలో ఈ నాణేలే ఉపయోగపడ్డాయి.