Latest News Trends

రూ.2వేలకే లెనోవో స్మార్ట్‌బ్యాండ్..!

 

 

 

 

 

 

 

 

 
లెనోవో తన మొదటి స్మార్ట్‌బ్యాండ్ ను భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ‘లెనోవో స్మార్ట్‌బ్యాండ్ (హెచ్‌డబ్ల్యూ01)’ పేరిట విడుదలైన ఈ బ్యాండ్ రూ.1,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా లభిస్తోంది. ఇందులో 0.91 ఇంచ్ ఓలెడ్ టచ్ డిస్‌ప్లే, 128 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, యూవీ కోటింగ్, హార్ట్ రేట్ సెన్సార్, ఫిట్‌నెస్, స్లీప్ ట్రాకర్, వైబ్రేటింగ్ అలారం, యాంటీ స్లీప్ మోడ్, ఐపీ65 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌బ్యాండ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్యాండ్ కనెక్ట్ అవుతుంది. ఇందులో 85 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. ఒక సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 5 రోజుల వరకు ఈ బ్యాండ్‌ను వాడుకోవచ్చు.