Featured2 Latest News

రెడ్ సిగ్నల్ కు… విమానం కుప్పకూలింది..

 

 

 

 

 

 

 

రెడ్ లైట్ పడింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతలో ఉప్పెనలా ఉపద్రవం దూసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ విమానం సిగ్నల్ దగ్గర కుప్పకూలింది. కరెంట్ వైర్లకు తగిలి ఫైర్ బాల్ లా కాలి బూడిదైంది.
వాషింగ్ట‌న్‌లోని ముకిల్టియోలో ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ ప్రమాదం వాహ‌న‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డ‌టంతో ఖాళీ ప్ర‌దేశంలో ల్యాండ్ చేద్దామ‌నుకున్నాడు పైలెట్. విమానం మ‌రీ కింద‌కు వ‌చ్చిన ప్రాంతంలో రోడ్ల‌కు ఇరుప‌క్క‌ల క‌రెంట్ తీగ‌లు ఉండ‌టంతో షార్ట్ స‌ర్క్యూట్ అయింది. దీంతో ద‌ట్టంగా పొగ‌లు వ్యాపించి మంట‌లు చెల‌రేగాయి. విమానం అక్క‌డిక్క‌డే కాలి బూడిద‌యిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో కొన్ని కార్లు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి. అయితే ప్రాణ‌న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో జ‌నాలు ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని ముందే ఊహించిన పైలెట్.. దూకేయ‌డంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.