Featured Movies

రొమాన్స్ కు రెడీ

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అంటోంది. అది మామూలుగా కాదు రీఎంట్రీ ఇవ్వబోయే చిత్రాల్లో రొమాన్స్‌ చేయాలని ఉందంటోంది.‘నేను కామెడీ చిత్రాల్లో.. హారర్‌ చిత్రాల్లో నటించాను. డ్రామా.. ఎమోషన్స్‌ ఉన్న చిత్రాల్లోనూ నేనేంటో నిరూపించుకున్నాను. ఇప్పుడు నాకు రొమాంటిక్‌ సినిమాలో అద్భుతమైన రొమాన్స్‌ను పండిచాలని ఉంది. అలాగే పరిణతి చెందిన మహిళా పాత్రలోనూ నటించాలని ఉందంటూ’ తన మనసులో మాట బయటపెట్టింది. ఈ విషయం విన్న తర్వాత దర్శక నిర్మాతలు సుస్మితాకి ఎలాంటి రొమాంటిక్‌ కథలే చెబుతారో చూడాలి.