Latest News Movies

రోడ్ ప్రమాదంలో టీవీ నటి మృతి

 

 

 

ప్ర‌ముఖ క‌న్న‌డ టీవీ న‌టి రేఖా సింధు కారు ప్ర‌మాదంలో మృతి చెందింది. చెన్నై, బెంగ‌ళూరు హైవేపై పేర్నంబ‌ట్ స‌మీపంలోని సున్నంపుకుట్టై గ్రామంలో ఈ ఘటన జరిగింది.చెన్నై నుంచి బెంగ‌ళూరుకు రేఖ, ఆమెతో పాటు మ‌రో ముగ్గురు కారులో ప్రయాణిస్తున్నారు. వేగంగా ప్ర‌యాణిస్తున్న కారు డివైడ‌ర్ ను ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అతి వేగమే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన రేఖ సంఘ‌ట‌నా స్థ‌లంలోనే చనిపోయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మ‌రో ముగ్గురు కూడా ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన వారిని అభిషేక్ బ‌చ్చ‌న్(22), జ‌య‌కంద్ర‌న్(23), ర‌క్ష‌న్(20)గా పోలీసులు గుర్తించారు.