Social

లడ్డూ బాబుల మధ్య సీటిచ్చారని…

 

 

 

 

 

 

 

 

విమానంలో ఇద్దరు ఊబకాయుల మధ్య తనకు సీటివ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఓ ప్రయాణికుడు కోర్టులో దావా వేశాడు. విమాన ప్రయాణంలో ఇబ్బంది కలిగించినందుకు లక్ష డాలర్ల (దాదాపు రూ.64 లక్షల) పరిహారం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు అమెరికా ఎయిర్‌లైన్స్‌పై ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. ఊబకాయుల మధ్య సీటివ్వడం వల్ల తాను 9 గంటలపాటు అత్యంత ఇబ్బందికరంగా ప్రయాణం చేయవలసి వచ్చిందన్నాడు. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన టేలర్ 2015 డిసెంబర్‌లో సిడ్నీ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లేందుకు విమానం ఎక్కిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆస్ట్రేలియాకు చెందిన న్యూస్.కామ్ వార్త సంస్థ తెలిపింది.