Movies

లాల్ న్యూ లుక్ కి ఫిదా

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ విలన్ పోస్టర్ విడుదలైంది. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. మోహన్ లాల్, మంజు వారియర్, విశాల్, శ్రీకాంత్, హన్సిక మోత్వానీ మరియు రాఖి ఖన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకి భార్యగా మంజు వారియర్ నటిస్తుంది. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు. విలన్ చిత్రాన్ని ఇటు తెలుగు అటు మలయాళంలో జూలై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో మోహన్ లాల్ న్యూ లుక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.