crime Featured Social

లైవ్‌లో సూసైడ్ చేసుకోబోతే.. పోలీసులు వచ్చేశారు…

 

 

 

 

 

 

ఫేస్ బుక్ లైవ్ వచ్చాక.. అయినదానికి..కానిదానికి తెగ వాడేస్తున్నారు.చివరకు ఆత్మహత్యలు చేసుకోబోయే ముందు కూడా ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు లైవ్ స్ట్రీమింగ్ పెట్టేస్తున్నారు. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి సూసైడ్ చేసుకోబోయిన ఓ మహిళను ముంబై పోలీసులు అడ్డుకున్నారు. అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రకు చెందిన ప్రియాంక జెథలాల్‌ మరు అనే లాయర్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. సెవ్రీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 18వ అంతస్థుకు ఎక్కిన ప్రియాంక.. ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌ ఆన్‌ చేసింది. తాను ఇక్కడి నుంచి దూకబోతున్నానని లైవ్‌లో చెప్పింది. అయితే ప్రియాంక భవనం ఎక్కుతుండగా చూసిన స్థానికులు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి.. కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో ఓ విద్యార్థి బంద్రా శివారులోని ఓ స్టార్ హోటల్‌లో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ 19వ అంతస్థు నుంచి దూకి చనిపోయాడు.