Featured Health Latest News

వందో ప్లాస్టిక్ సర్జరీ చేస్తుండగా మోడల్… ఆకస్మిక మృతి..

 


భారీ ఎత్తున ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ… శరీరాకృతిని మార్చుకునేందుకు ప్రయత్నించిన ప్రముఖ మోడల్ క్రిస్టినా మార్టెల్లీ మృతి చెందింది. ఓ కాస్మోటిక్ సర్జరీ జరుగుతుండగా మధ్యలోనే గుండెపోటు రావడంతో ఆమె చనిపోయినట్టు చెబుతున్నారు.

ఫోటోలతో సోషల్ మీడియాలో హీటెక్కించే క్రిస్టినా.. క్యూబెక్‌లో పుట్టిపెరిగింది. 17 ఏళ్ల వయసు నుంచే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 100 పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

ప్లాస్టిక్ సర్జరీలంటే ఎందుకంత మక్కువో తన వెబ్‌సైట్లో రాసుకుంది క్రిస్టినా. ‘‘నా సర్జరీలన్నిటి వెనుక ఉన్న కారణం ఒకటే.. నా శరీరాన్ని ఎప్పటికప్పుడు మరో స్థాయిలో తీర్చిదిద్దుకోవాలన్నది నా కోరిక. అందువల్ల నాకేం చింతలేదు..’’ అని తన వెబ్‌సైట్లో పేర్కొంది. డాక్టర్లు ఆమెకు బట్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తుండగా మూర్ఛవచ్చి గుండెపోటుకు గురైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. గత నెల 18న క్రిస్టినా ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందనీ.. అది వికటించడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురైందని మరికొన్ని కథనాలు వినబడుతున్నాయి.